హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్క పురుగులతో తండావాసుల అవస్థలు!

WNP: కొత్తపల్లి తండాలో లక్క పురుగుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ఇళ్లలోకి పురుగులు చేరి నిద్ర, భోజనానికి అంతరాయం కలిగిస్తున్నాయని వాపోతున్నారు. సమీపంలోని గోదాంలో నిల్వ చేసిన ధాన్యం నుంచే పురుగులు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిశీలించి నివారణ చర్యలు చేపడతామని DM ఆంజనేయులు తెలిపారు.