హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డీకే అరుణ

MBNR: మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ హిందూ బంధువులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఊరూరా ఏర్పాటు చేసిన మండపాలలో వినాయకుడిని ఎంతో వైభవంగా కొలువుదీర్చి, భక్తులందరూ కలిసికట్టుగా, పూర్ణ భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా తన సందేశాన్ని పంచుకున్నారు.