హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కనెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఏఈ

KMR: వినాయక మండపాల వద్ద విద్యుత్‌ కనెక్షన్లు తీసుకునే సమయంలో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని భిక్కనూర్‌లో ట్రాన్స్‌కో AE సంకీర్త్‌ సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్‌ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. తడి చేతులతో విద్యుత్‌ వైర్లు తాకవద్దని సూచించారు. మండపాల వద్ద విద్యుత్‌ కనెక్షన్లు ఏర్పాటు చేసేటప్పుడు నిబంధనలు పాటించాలని కోరారు.