హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో రైతు సదస్సు కార్యక్రమం

WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలోని కోదండరామస్వామి మందిరంలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు వి. సుబ్బయ్య మాట్లాడుతూ.. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మద్దతు ధర కల్పించాలని కోరారు.