MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారు సోమవారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ భవానీ మాతకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మంజీరా నదిలో స్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: శ్రీ ఏడుపాయల్లో వనదుర్గాభవానీకి విశేష పూజలు


