WNP: పామిరెడ్డిపల్లి, వీరాయపల్లి గ్రామాల్లో వీధి శునకాల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుంపులుగా తిరుగుతూ రహదారులు, వీధుల్లో ప్రజల వెంటపడుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులను వెంటాడడంతో అదుపుతప్పి కిందపడుతున్నారని పేర్కొన్నారు. ఎటువైపు నుంచి వచ్చి కరుస్తాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శునకాలను దూరప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.
తెలంగాణ
గ్రామాల్లో వీధి శునకాల బెడద!


