SRPT: మునగాలలోని అయ్యప్ప దేవాలయంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించారు. ఆదివారం ఉదయం ఆలయ పూజారి రామారావు గురుస్వామి గమనించి కమిటీ ఛైర్మన్ శ్రీనివాసాచారికి సమాచారం ఇచ్చారు. గతంలోనూ మూడుసార్లు చోరీ జరిగిందని, పోలీసులు రాత్రి గస్తీ పెంచాలని కోరారు.
తెలంగాణ
అయ్యప్ప ఆలయంలో హుండీ చోరీ!


