హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరామ్ రెడ్డి సేవలు జిల్లాకే గర్వకారణం: MLA

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ శిశువైద్యుడు డా. మల్లాది శ్రీరామ్ రెడ్డి ఐదు రాష్ట్రాల నుంచి ఎంపికై ‘ఎమినెంట్ పీడియాట్రిషన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందుకోనున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. చిన్నారులకు విశిష్ట వైద్య సేవలు అందిస్తూ వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.