హైదరాబాద్: 28°C
తెలంగాణ

6.7 కిలోల గంజాయి పట్టివేత

MHBD: ఒడిశా నుంచి 6.7 కిలోల ఎండు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని మరిపెడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వాహన తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి రూ.3.25 లక్షల విలువైన గంజాయి, ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. గంజాయి అక్రమ రవాణపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.