JN: చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో ఆదివారం ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లిన దంపతుల ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలోని 6 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 వేల నగదుతో కలిపి సుమారు రూ.8 లక్షల విలువైన సొత్తును దుండగులు అపహరించినట్లు ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
చర్చికి వెళ్లిన వేళ.. రూ.8 లక్షల చోరీ


