JN: జఫర్‌గఢ్ మండలంలోని కోనాయచలంలో కోనారెడ్డి చెరువుకు వెళ్లే వరద కాల్వపై నిర్మించిన కల్వర్టు రెయిలింగ్ విరిగిపోయి ప్రమాదకరంగా మారింది. గుర్తుతెలియని వాహనం కల్వర్టు గోడను ఢీకొట్టడంతో రెయిలింగ్ ధ్వంసమైంది. కూనూర్, జఫర్‌గఢ్ ప్రజలు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుండటంతో అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన కల్వర్టు


