హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్త వేధింపులతో వివాహిత మృతి

WGL: భర్త వేధింపులు భరించలేక మిల్లీ బిస్వాల్‌ (21) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం గీసుకొండ మండలం ధర్మారంలో జరిగింది. భర్త అనుమానంతో వేధిస్తున్నాడని ఈ నెల 8న తల్లికి ఫోన్‌లో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి మేనమామ దిలీప్ మహంతి ఫిర్యాదు మేరకు భర్త గుప్తేశ్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.