హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 23న వినాయక నిమజ్జనాలు చేయాలని నిర్ణయం

PDPL: గోదావరిఖని VHP భవన్‌లో గణేశ్ ఉత్సవ సమితి, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం జరిగింది. సోమవారం వినాయక ప్రతిష్ఠాపన, 23న సామూహిక నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. 9 రోజుల ఉత్సవాల అనంతరం 10వ రోజు నిమజ్జనం ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో కొల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.