హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి కార్యక్రమం రద్దు

ASF: గణేష్ చతుర్థి సందర్భంగా సోమవారం బెజ్జూరు మండల కేంద్రంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ సెలవు కారణంగా రద్దు చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండనందున ప్రజలు ప్రజావాణికి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. తిరిగి ఈ నెల 21న (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని వెల్లడించారు.