హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం..!

MDCL: ఉప్పల్‌, నాచారం, తార్నాక, హబ్సిగూడ, బోడుప్పల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులపై భారీగా నీరు చేరుతోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. మరో గంటలో వర్షం నగరవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.