GDWL: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అయిజ ఎస్సై గురుస్వామి సూచించారు. రోడ్లు ఆక్రమించి మండపాలు నిర్మించవద్దని, రాత్రివేళ భారీ శబ్దంతో డీజేలు వాడరాదన్నారు. మండపాల వద్ద విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, నిమజ్జనంలో సోదరభావంతో మెలగాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
వినాయక వేడుకలపై ఎస్సై సూచనలు


