హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోడి పందేల స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్

MNCL: కన్నెపల్లి మండలంలోని లింగాల గ్రామశివారులో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్త దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందేలు నిర్వహిస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 2,100 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.