హైదరాబాద్: 28°C
తెలంగాణ

మణికొండలో భారీ అగ్ని ప్రమాదం

మణికొండలోని బీఆర్సీ బిల్డింగ్ సమీపంలోని ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసే సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్సర్క్యూట్ సహా ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.