హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ ఉత్సవాలకు పటిష్ట భద్రత

KNR: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. నేర సమీక్షలో భాగంగా పోలీస్ అధికారులతో సమావేశమైన ఆయన.. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని కోరారు.