హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి!

NZB: కంఠేశ్వర్ బైపాస్‌లోని ఓ సూపర్ మార్కెట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు NZB రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. చంద్రశేఖర్ కాలనీకి చెందిన కళావతి(40) రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టిందన్నారు. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం HYD తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు.