హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి: సీఐ

PDPL: ప్రకృతి ప్రేమికుడిగా గుర్తింపు పొందిన గట్టు కృష్ణమూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మంథని సీఐ బుద్దె స్వామి అన్నారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో కృష్ణమూర్తిని సీఐ అభినందించారు. మంథని ప్రాంతంలో వృక్ష సంపద పెంపొందించేందుకు ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మొక్కల సంరక్షణకు పోలీసుల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.