హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ పవర్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్

AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జాతీయ స్థాయి క్రీడా పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎం. అమృతవల్లి అనే విద్యార్థిని సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు ఢిల్లీలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని హెచ్‌ఎం సరోజిని ప్రత్యేకంగా అభినందించారు.