హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

19న గన్నవరంలో ఐలూ జిల్లా మహాసభలు

కృష్ణా: జిల్లా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) జిల్లా మహాసభలు ఈ నెల 19న గన్నవరంలో నిర్వహించనున్నట్లు సీనియర్ జిల్లా నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ బలోపేతం, రాజ్యాంగ విలువలు, ప్రజా హక్కుల పరిరక్షణ, న్యాయవాదుల సంక్షేమం, సామాజిక న్యాయంపై చర్చిస్తామని చెప్పారు.