హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21వ రోజుకు న్యాయవాదుల నిరాహార దీక్ష!

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. జిల్లా న్యాయవాదుల సంఘం కోర్టు ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 21వ రోజుకు చేరాయి. లాయర్లు జయ భారత్ రెడ్డి, షాషావలి, అర్షిద్ ఫార్హీన్, నాగశేఖర్, మొహమ్మద్ అన్వర్ సాదత్, గోపాల్ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే బెంచ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.