హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి ముఠా అరెస్ట్..!

VSP: ఆరిలోవలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరుపుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు CI శ్రీనివాస్ తెలిపారు. VIMS ఆసుపత్రి సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితులు దినేష్ కుమార్ (A1), సందీప్ (A2), రిషేంద్ర (A3), యశ్వంత్ (A4), ధన (A5)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3.055 కిలోల గంజాయి, ఒక స్కూటీ, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.