హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట కాలువలో మృతదేహం

ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామ పంట కాలువలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదని చెప్పారు. ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.