కృష్ణా: వినాయక చవితి వేడుకలకు మచిలీపట్నం మంగినపూడి బీచ్ ముస్తాబైంది. 63 అడుగుల భారీ సప్తమృత్తిక విజయ గణపతి విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సముద్ర అలల హోరు, విద్యుత్ కాంతులు, త్రివర్ణ పతాకాలతో తీరం పండుగ శోభను సంతరించుకుంది. భక్తుల వినోదం కోసం ప్రత్యేక రైడ్లు, వివిధ స్టాళ్లను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చవితి వేడుకలకు మంగినపూడి సిద్ధం


