కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని శ్రీ సమయమంతుల, మాతంశెట్టి వార్ల అన్నదాన సత్రంలో ఆదివారం వేదపండితులచే వేద సభ నిర్వహించారు. వేదపండితులు అధిక సంఖ్యలో పాల్గొని చతుర్వేదాలను పఠించి, అనంతరం భక్తులకు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో సత్రం ఛైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ర్యాలీ గ్రామంలో చతుర్వేద పారాయణం


