హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొదలైన వినాయక చవితి సందడి

ELR: వినాయక చవితి సందర్భంగా ఏలూరు జిల్లాలో పూజా సామగ్రి దుకాణాలు ఆదివారం సందడిగా కనిపించాయి. వినాయక ప్రతిమలు, పాలవెల్లులు, పత్రిలు, పూలదండలు, పండ్లు, మొక్కజొన్న పొత్తులు, కొబ్బరికాయలు తదితర పూజా వస్తువులతో దుకాణాలు సిద్ధమయ్యాయి. మరోవైపు వినాయక మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండపాల అలంకరణలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.