ప్రకాశం: పోలీసులమని చెప్పి బంగారు ఆభరణాలు చోరీ చేసే మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. కొందరు వ్యక్తులు పోలీసులమని పరిచయం చేసుకుని, ఆభరణాలు ధరించడం ప్రమాదమని భయపెడతారని తెలిపారు. భద్రత పేరుతో ఆభరణాలను కాగితంలో లేదా కవర్లో పెట్టమని చెప్పి, అసలు ఆభరణాల స్థానంలో నకిలీ పొట్లాలు ఇస్తారని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులమని చెప్పి చోరీ చేస్తారు: ఎస్పీ


