హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి విగ్రహాలను పంపిణీ అభినందనీయం: పరిటాల

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పరిటాల శ్రీరామ్ పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉంచుకోవాలని సూచించారు.