హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భక్తితో వినాయక చవితి జరుపుకుందాం'

SKLM: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. భక్తి, సంప్రదాయంతో వినాయక చవితి జరుపుకోవాలని అన్నారు.