హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దెబ్బతిన్న నీటి ట్యాంక్‌.. ఇబ్బందుల్లో గ్రామస్థులు

ASR: డుంబ్రిగూడ మండలంలో పోతంగి పంచాయతీ పరిధిలోని పామురై గ్రామంలో తాగునీటి ట్యాంక్‌ దెబ్బతిని రంధ్రాలు ఏర్పడ్డాయి. దీంతో ట్యాంకులో నీరు నిల్వ ఉండకపోవడంతో తాగునీరు కోసం అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి ట్యాంకుకు మరమ్మతులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు.