CTR: పుంగనూరు బాలాజీ థియేటర్ వద్ద జాతీయ రహదారిపైకి మురుగునీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని సగభాగం మురుగునీరు ప్రవహించే ప్రధాన డ్రైనేజీ కాల్వలో చెత్త పేరుకుపోవడమే దీనికి కారణం. అధికారులు సక్రమంగా చెత్తను తొలగించకపోవడంతో తరచూ కాల్వ పొంగిపొర్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ రహదారిపై మురుగునీరు


