హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నకిలీ ACB అధికారుల దందా.. రూ.1.30 లక్షలు స్వాహా

KKD: తాము ACB అధికారులమంటూ ఫోన్ చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్ల తీరు గొల్లప్రోలు ప్రభుత్వ కార్యాలయాల్లో భయాందోళన రేపింది. ఈ క్రమంలో వీఆర్ఏ వెంకటపతి వారికి రూ.1.30 లక్షలు చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది. ఫోన్ చేసిన వారు అసలైన అధికారులు కారని సమాచారం. VRO ఇచ్చిన ఫిర్యాదుతో నకిలీ ACB వలలో ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.