హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు 'PGRS' రద్దు: కలెక్టర్

ELR: వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 14న సెలవు కావడంతో జిల్లాలో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం కోసం 1100 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చన్నారు.