హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట తోటలను ఆదుకోవాలని శైలజనాథ్ డిమాండ్

ATP: బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట చేనులను సాకే శైలజనాథ్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వల్ల రైతుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఎల్‌సి కాలువల దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని, నష్టపోయిన రైతులకు ప్రత్యేక పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.