హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాల సంజీవని టెండర్లలో గోల్‌మాల్ అరికట్టాలి'

VSP: అంగన్వాడీలకు పోషకాహార సరఫరాలో అక్రమాలను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆదివారం డిమాండ్ చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రూ.172.80 కోట్ల బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్‌ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ధరల వ్యత్యాసంతో ప్రభుత్వానికి రూ.29.22 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.