హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ షిర్డీసాయి మందిరంలో చోరీ

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని కొండేపాలెం గ్రామంలో శ్రీ షిర్డీసాయి మందిరంలో చోరీ జరిగింది. భక్తులు సమర్పించిన కానుకల హుండీ నుంచి నగదు అపహరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టి, గుడ్లవల్లేరు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు వెల్లడించారు.