హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం సబ్ జైల్లో ఆకస్మిక తనిఖీ

W.G: ఉమ్మడి జిల్లాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ శ్రీదేవి ఆదివారం ఉదయం నరసాపురం ఉప కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల కేసుల వివరాలతో పాటు వారికి అందుతున్న ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలపై ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు. జైలు ప్రాంగణంలోని ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవలన్నారు.