హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రి 10 తర్వాత డీజేలు నిషేధం: ఎస్పీ

ATP: జిల్లాలో రాత్రి 10 గంటల తర్వాత అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. డీజేల వినియోగం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు, పరికరాలు సీజ్ చేసి యజమానులు, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు.