హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రౌడీషీటర్లకు హెచ్చరిక'

NTR: విజయవాడలో పండగల సమయంలో రౌడీషీటర్లు అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని టూటౌన్‌ సీఐ కొండలరావు హెచ్చరించారు. ఆదివారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు హాజరు కావాలని సూచించారు. పండగల వేళ రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.