హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైళ్లలో చోరీలు.. హర్యానా దొంగల అరెస్టు

గుంటూరు: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెనాలి రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిందితులు 12 చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. హర్యానాలోని నుహా జిల్లా సింగాల్ గ్రామంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.