హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతూ పట్టుబడిన పోలీసులు

KDP: కడపలో పేకాట ఆడుతూ పట్టుబడిన నలుగురు పోలీసులపై ఎస్పీ నచికేత్ వేటు వేశారు. స్థానిక సీఐ దాడుల్లో ఒక ఏఆర్ కానిస్టేబుల్, ముగ్గురు సివిల్ కానిస్టేబుళ్లు పేకాట స్థావరంలో దొరికారు. వారిని అరెస్టు చేసి ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వడంతో, శాఖాపరమైన విచారణ చేపట్టి నలుగురు కానిస్టేబుళ్లను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.