ASR: అరకులోయలో వినాయకచవితి పండుగ సందడి నెలకొంది. ఆదివారం వినాయకుడి పూజకు అవసరమైన పాలవెల్లి, పత్రాలు, పండ్లు, పూలు కొనుగోలుకు ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు. దీంతో వ్యాపార సముదాయాలు కిటకిటలాడాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన గణేష్ విగ్రహాలను ఉత్సవ కమిటీ సభ్యులు మండపాలకు తరలించారు. ప్రజల రాకతో మార్కెట్ ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
'కళకళలాడిన అరకులోయ'


