KDP: ఎర్రగుంట్ల–కడప రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఆటో రోడ్డు దాటుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
లారీ, ఆటో ఢీ.. పలువురికి గాయాలు


