హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై కమలాపురం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప చిన్నచౌక్కుకు చెందిన వాకిటి వెంకటమ్మ మృతి చెందగా, మాసాపేటకు చెందిన షేక్ మహబూబ్ బాషా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహబూబ్ బాషాను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.