హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మట్టి గణపతిని పూజిద్దాం'

ELR: మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వాళ్లం అవుతామని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చామర్తి శ్రీరాములు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ఆదివారం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు గురునాథ రావు పాల్గొన్నారు.