బాపట్ల: మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్‌లో గణేష్ నవరాత్రుల సందర్భంగా 1008 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మందిర కమిటీ తెలిపింది. 36వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులు బొర్లగడ్డ నారాయణ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ పంపిణీ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కమిటీ కన్వీనర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
1008 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ


