హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఖాజీపేట మండల పరిధిలోని నందిపాడు కాలనీ సమీపంలో కడప–కర్నూలు ప్రధాన రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రహదారి పక్కన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు, స్వస్థలం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే మృతికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది